Cyclone alert : దానా తుఫాన్​ దూసుకొస్తోంది.. 

Cyclone alert : దానా తుఫాన్​ దూసుకొస్తోంది.. 

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తుఫాన్​ గా మారుతుందని భారత వాతావరణశాఖ తెలిపింది. ఈ తుఫాను (Cyclone) దానా తుఫాన్​గా పేరు పెట్టారు. ఈ అల్పపీడనం వాయవ్య దిశగా దూసుకొస్తోందని, క్రమంగా బలపడి వాయుగుండంగా, ఆ తర్వాత తుఫానుగా మారుతుందని ఐఎండీ తెలిపింది. ఈ దానా తుఫాన్‌ పూరీ సమీపంలో తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. తుఫాన్‌ ప్రభావంతో రాగల మూడు నాలుగు రోజులు ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కాబట్టి ఈ నెల 24 వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. 

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రాంతం అక్టోబర్ 23 నాటికి తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆ తెలిపింది. ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాన్ని తుఫాను తాకుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తూర్పు-మధ్య బంగాళాఖాతాన్ని  ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రం మీద అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది పశ్చిమ-వాయువ్య-పశ్చిమ దిశగా కదిలి అక్టోబర్ 22 ఉదయం నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది .  అక్టోబర్ 23 నాటికి తూర్పు-మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉందని IMD తెలిపింది.దీని ప్రభావంతో అక్టోబర్ 23 ,24,25 తేదీల్లో ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. అలాగే ఏపీ లోని కోస్తా ప్రాంతాలో భారీ వర్షాలు పడే  అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

Also Read :- మెట్రో స్టేషన్‌లో అర్థరాత్రి అగ్ని ప్రమాదం (వీడియో)

దానా తుఫాను కారణంగా మత్స్యకారులకు వాతావరణశాఖ కీలక హెచ్చరికలు జారీచేసింది. అక్టోబర్ 25 వరకు అండమాన్ సముద్రంలో... అక్టోబర్ 22, 24 తేదీల్లో మధ్య బంగాళాఖాతంలో..అక్టోబర్ 24 నుంచి 25 వరకు ఉత్తర బంగాళాఖాతంలోకి వేటకు వెళ్లరాదని సూచించారు.

దానా తుపాను కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  రోడ్లు జలమయం అయి... విద్యుత్​ సరఫరాకు అంతరాయం ఏర్పడవచ్చని ... ఇంకా కొండ చరియలు విరిగిపడే ప్రమాదం ఉందని  ఐఎండీ వెల్లడించింది.మరీ ముఖ్యంగా పాత, శిథిలావస్తకు చేరుకున్న ఇళ్లల్లో ఉండకూడదని సూచించింది.